పాక్‌పై ఆన్లైన్ పిటీషన్‌కు నెటిజన్లు మంచి స్పందన...
- September 27, 2016
పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని కోరుతూ వుయ్ ద పీపుల్ కార్యక్రమంలో భాగంగా ఆన్లైన్లో దాఖలు చేసిన ఓ పిటీషన్‌కు నెటిజన్లు స్పందించారు. ఉగ్రవాదానికి పాకిస్థాన్ పెట్టుబడిదారుగా వ్యవహిరిస్తోందంటూ ఈనెల 21న ఇండో-అమెరికన్ పౌరులు ఆన్లైన్లో పిటీషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటీషన్ ఒబామా పరిశీలించాలంటే లక్ష సంతకాలు అవసరం. కాగా కేవలం ఐదు రోజుల్లోనే దాదాపు 82వేల మంది దీనికి మద్దతుగా సంతకాలు చేశారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల కారణంగా భారత్‌తో పాటు పలు దేశాలు శాంతిభద్రతల సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ సభ్యుడు, ఉగ్రవాదంపై హౌస్ సబ్‌కమిటీ ఛైర్మన్ టెడ్పోయ్, మరో కాంగ్రెస్ సభ్యుడు డానా రోహర్బాచర్లు ప్రారంభించారు.త్వరలోనే ఈ పిటీషన్‌ను అమెరికన్ కాంగ్రెస్ పరిశీలనకు ఉంచనున్నారు.పాక్ ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు సరైన సమయం వచ్చిందని వారు అభిప్రాయపడ్డారు. అక్టోబర్ 21లోపు ఈ పిటీషన్‌ను వైట్‌హౌస్ వెబ్‌సైట్‌కు అందజేయాలి. గడువు తేదీ కంటే ముందే తమ లక్ష సంతకాల లక్ష్యాన్ని చేరుకుంటామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!







