తైవాన్ ను మరోసారి టైఫూన్ చుట్టేస్తోంది...
- September 27, 2016
తైవాన్ ను మరోసారి టైఫూన్ చుట్టేస్తోంది. రెండు వారాల్లో మూడోసారి దాడి చేయనుంది. ఈ భయంతో వేలమంది తమ నివాసాలను ఖాళీ చేశారు. వందల్లో కార్యాలయాలు, పాఠశాలలు మూతపడ్డాయి. వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. ప్రస్తుతానికి శరవేగంతో దూసుకొస్తున్న తైపూన్'మెగి' రేపు సరిగ్గా తైవాన్ తీరాన్ని తాకనుంది. దీరి ప్రభావంతో ఇప్పటికే బలమైన గాలులు వీస్తూ చుక్కలు చూపిస్తున్నాయి. ఐలాండ్ కు సమీపంగా మెగి వచ్చిన నేపథ్యంలో దాదాపు ధ్వంసం చేసేంత ప్రభావాన్ని చూపిస్తోంది. అధికారులంతా అప్రమత్తమయ్యారు.ముందస్తు జాగ్రత్తగా 5వేలమంది ప్రజలు తీర ప్రాంతాన్ని వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లినట్లు తైవాన్ కేంద్ర అత్యవసర సేవల నిర్వహణా సంస్థ తెలిపింది.టైఫూన్ కారణంగా 36 వేల నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 575 అంతర్జాతీయ, దేశీయ విమాన సర్వీసులను నిలిపేసినట్లు చెప్పారు. మరో 109 విమానాల సర్వీసులు ఆలస్యం అవుతాయన్నారు. ప్రస్తుతం భీకరగాలులు వీస్తున్నాయి. ఇప్పటికే వేలమంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







