జియాంట్ మరియు గల్ఫ్ మార్కెట్ - గ్రాండ్ బజార్
- September 27, 2016
మనామా: జియాంట్ హైపర్ మార్కెట్స్, గల్ఫ్ మార్ట్ సూపర్ మార్కెట్స్ - రెండు వారాల్లో గ్రాండ్ బజార్‌లా మారనున్నాయి. సౌక్ బజార్స్ మరియు బొటిక్స్‌కి సంబంధించి అధునాతనంగా తీర్చిదిద్దనున్నారు. ఈ ఈవెంట్‌ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు జీయాంట్ మరియు గల్ఫ్ మార్ట్‌ని నిర్వహిస్తున్న ఫుకామ్ ఇంటర్నేషనల్, టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇద్దరు వ్యక్తులకు టర్కీ వెళ్ళేందుకు రిటర్న్ ఎయిర్ టిక్కెట్స్‌ని ప్రొవైడ్ చేయనుంది. మొత్తం 16 మంది విజేతలకు ఈ అవకాశం కల్పిస్తుంది. దీనికోసం కేవలం 10 బహ్రెయినీ దినార్స్ గ్రాండ్ బజార్‌లో ఖర్చు చేస్తే సరిపోతుంది. రిచ్ సౌక్ కల్చర్ మరియు అలాగే ప్రపంచంలోనే ప్రత్యేకమైన కోవర్డ్ మార్కెట్‌ని సావనీర్స్, గిఫ్ట్స్, జ్యుయెలరీ, కార్పెట్స్, క్లోత్స్, ఫుడ్, ఎలక్ట్రానిక్స్ ఇంకా అనేకవాటికి సంబంధించి నిర్వహిస్తున్నామనీ, తమ వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకే ఈ కొత్త ప్రయోగం చేపడుతున్నామని జియాంట్ వెల్లడించింది. గ్రాండ్ బజార్‌లో మిడిల్ ఈస్ట్ అలాగే ఫార్ ఈస్ట్‌లకు సంబంధించిన అన్ని ప్రత్యేకతల్నీ పొందుపర్చినట్లు కంపెనీ వర్గాలు వివరించాయి.
తాజా వార్తలు
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







