మహిళలకు సంపూర్ణ హక్కుల కోసం పిటిషన్‌

- September 27, 2016 , by Maagulf
మహిళలకు సంపూర్ణ హక్కుల కోసం పిటిషన్‌

రియాద్‌: వేలాది మంది సౌదీలు, గార్డియన్‌ షిప్‌ సిస్టమ్‌ని వ్యతిరేకిస్తూ పిటిషన్‌కి మద్దతు పలుకుతున్నారు. గార్డియన్‌ షిప్‌ ద్వారా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు వ్యతిరేకంగా చాలాకాలంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వర్క్‌, స్టడీ, మ్యారేజ్‌ మరియు ట్రావెల్‌ వంటి విషయాల్లో మహిళలకు పురుషుల నుంచి సమస్యలు తలెత్తుతున్నాయి. కారణం, అన్ని విషయాల్లోనూ పురుషుల సహకారం మహిళలకు తప్పనిసరి కావడం వల్లే. 14,700 మందితో కలిసి పిటిషన్‌ని రాయల్‌ కోర్ట్‌లో తమ వాదనల్ని వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని యూనివర్సిటీకి రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ అజిజా అల్‌ యూసెఫ్‌ చెప్పారు. మహిళలు వాహనాల్ని నడిపేందుకు కూడా వీలు లేని కఠిన నిబంధనలు సౌదీ అరేబియాలోనే ఉండడం పట్ల మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళ చదువుకోవడానికీ, ప్రయాణించడానికీ, ఇతర పనుల కోసం తండ్రి, భర్త లేదా సోదరుడి అనుమతి తీసుకోవాల్సి రావడం విచారకరమని మహిళా ఆందోళనకారులు అంటున్నారు. తండ్రి లేదా భర్త లేదా సోదరుడు విశాల హృదయంతో ఆలోచిస్తే సమస్యలు ఉండవనీ, కానీ అన్ని సందర్భాల్లోనూ అది సాధ్యం కావడంలేదని వారు ఆరోపించారు. సౌదీ అరేబియాలో 10 మిలియన్‌ మహిళలు ఉన్నట్లుగా ఓ అంచనా చెబుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com