10 శాతం పెరిగిన పర్యాటకులు
- September 28, 2016
మనామా: కింగ్డమ్లోకి 2015లో అదనంగా 10 శాతం మంది (2014తో పోల్చితే) పర్యాటకులు విచ్చేసినట్లు బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (బిటిఇఎ) వెల్లడించింది. ఈ సందర్భంగా సిఇ షేక్ ఖాలిద్ బిన్ హుమూద్ అల్ ఖలీఫా మాట్లాడుతూ, 2015లో 11.6 మిలియన్ టూరిస్టుల్ని కింగ్డమ్ ఆహ్వానించిందనీ, అంతకు ముందు సంవత్సరం అంటే 2014లో ఈ సంఖ్య 10.4గా ఉందని ఆయన తెలిపారు. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ - వరల్డ్ టూరిజం డే సందర్భంగా ఈ వివరాల్ని వెల్లడించారు. హోటల్ ఆక్యుపెన్సీ 2015లో 52 శాతానికి చేరుకుందనీ, 2014లో ది 50 శాతం మాత్రమే ఉందని, 2013లో మరీ తక్కువగా 45 శాతం ఉందని గణాంకాలు చెబుతున్నాయి. యాత్రీకులు రోజువారీ ఖర్చు చేసే సరాసరి మొత్తాన్ని 110 బహ్రెయినీ దినార్స్గా పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని 2018 నాటికి 136 బహ్రెయినీ దినార్స్ వరకు పెంచేలా చర్యలు తీసుకుంటామని టూరిజం వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







