సహనం బలహీనతగా భావించొద్దని హోంమంత్రి నాయిని....

- September 28, 2016 , by Maagulf
సహనం బలహీనతగా భావించొద్దని హోంమంత్రి నాయిని....

 భారత్‌ మాతాకీ జై.. వందే మాతరం.. జై జవాన్‌.. జై హింద్‌ నినాదాలతో రవీంద్రభారతి హోరెత్తింది. మంగళవారం రవీంద్రభారతిలో ఇండియన్‌ ఆర్ట్‌ అండ్‌ కల్చరల్‌ ట్రస్ట్‌, భాషా సాంస్కృతి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అమర జవానులకు సాంస్కృతిక నివాళి అర్పించారు. ఇందులో భాగంగా ప్రముఖ గాయని మాళవిక, గాయకుడు మల్లిఖార్జున్‌ దేశభక్తి గీతాలను ఆలపించి అలరించారు. షేక్‌పేట్‌ దర్గాకు చెందిన నాగార్జున స్కూల్‌ విద్యార్థులు ప్రదర్శించిన నాటిక ప్రేక్షకులను కదిలించింది. దేశ సరిహద్దుల్లో మన జవాన్లు పాకిస్థాన్‌ ఉగ్రవాదులతో పోరాడే సంఘటనలు, జవాన్లు తమ కుటుంబ సభ్యులతో గడిపే సన్నివేశాలతో కూడిన నాటిక సందేశాన్ని ఇచ్చింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హాజరై వీర జవాన్లకు నివాళి అర్పించారు.ఈ సందర్భంగా సైనికులకు ధైర్యానిద్దాంమంటూ అందరిచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన సహనం బలహీనతగా భావించొద్దని తిరగబడితే తట్టుకోలేరన్నారు.ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించారని ట్రస్టీ సభ్యులు వివేకానంద, ఖలీద్‌లను అభినందించారు. సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ సభాధ్యక్షత వహించగా ఎన్‌సీసీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌.ఘర్‌పూర్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ సైనిక్‌ వెల్ఫేర్‌ పి.రమేష్‌కుమార్‌, నాగార్జున స్కూల్‌ కరస్పాండెంట్‌ కృష్ణగౌడ్‌, వివేకానంద, ఖాలీద్‌ తదితరులు హాజరై జవానులకు నివాళి అర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com