ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్లో సెన్సార్ బోర్డ్ చుట్టూ చర్చ ...
- September 28, 2016
నగరంలోని రామోజీ ఫిల్మ్‌సిటీలో మూడు రోజులుగా జరుగుతున్న ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్ మంగళవారంతో ముగిసింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన అనేకమంది సినీ ప్రముఖులు, సినిమా ప్రియులకు ఇండీవుడ్ కార్నివాల్ ఓ వేదిక అయింది. ఈ సందర్భంగా నిర్వహించిన చర్చల్లో పలు అంశాలపై సినీ విశ్లేషకులు సాధికారికంగా మాట్లాడి యువతను ఆకట్టుకున్నారు. వేడుకలో పలువురు ప్రముఖులకు వివిధ అవార్డులు అందజేశారు.
సెన్సార్ బోర్డ్ చుట్టూ చర్చ
రామోజీ ఫిలిం సిటీలో నిర్వహిస్తున్న ఇండీవుడ్ ఫిలిం కార్నివాల్లో చివరి రోజు హాట్‌హాట్ సమావేశం జరిగింది. ఇటీవలి కాలంలో అత్యంత వివాదాస్పదమైన సెన్సార్‌షిప్‌పై జరిగిన ఈ చర్చా కార్యక్రమంలో పలువురు దర్శకులు తమ భావాలను కుండబద్ధలు కొట్టినట్లు వెల్లడించారు.అసలు సెన్సార్షిప్ ముఖ్యోద్దేశం మాయమైంది. కానీ ఆ ఐడియాలజీ మాత్రం అలాగే ఉండి పోయింది. మీరు నమ్ముతారో లేదో 1920 ల నాటి భారతీయ సినిమాలో ముద్దు సీన్లు విరివిగానే ఉండేవి. కానీ 1928లో బ్రిటీషర్లు సెన్సార్షిప్ ప్రారంభించిన తరువాత రాజకీయ అంశాలను తొలగించడం చేశారు. తరువాత సెక్స్, వయెలెన్స్ లాంటివి. 1952లో స్వాతంత్య్రం వచ్చిన తరువాత సినిమాటోగ్రఫీ చట్టం వచ్చింది. ఆ తరువాతనే నిబంధనలు కూడా మారాయి. ఇక ఇటీవల కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీకు ఛైర్మన్‌గా మాకు అప్పగించిన పని సెన్సార్ సర్టిఫికేషన్‌లో క్లాసిఫికేషన్లు చేయడం. గతంలో ఉన్న సర్టిఫికేషన్ విధానానికి అదనంగా అడల్ట్ విత్ ఎక్స్‌సెప్షన్ అంటూ మరో విభాగం సృష్టించాం. దీనిలో సెక్స్, వయొలెన్స్ అధికంగా ఉండవచ్చు. కానీ దానికి కూడా కొన్ని మార్గదర్శకాలు ఇచ్చాం. కాకపోతే ఒక విషయం మాత్రం సుస్పష్టం... ఏమిటంటే ఓ క్రియేటర్ వర్క్‌ను అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి లేదు. అయితే మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం.. ఎక్కడ ఆ చిత్రాలను వీక్షిస్తున్నామన్నది కూడా పరిగణలోకి తీసుకోవాలి. సినిమా అతి పెద్ద ప్రభావం చూపుతుంది కాబట్టి రెగ్యులేటరీ బాడీ ఉండటం సమంజసమే. అయితే వీటన్నిటినీ మనం ఏ కోణంలో చూస్తున్నామన్న అంశం కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
-శ్యాం బెనగల్, దర్శకుడు సెన్సార్‌కు అతిపెద్ద బాధితుడిని నేను. దాదాపు 10 ఏళ్లగా సినీ రంగంలో ఉన్న నేను సెన్సార్ గురించి విన్నాను కానీ నా తొలి చిత్రంతోనే దాని రుచి ఏమిటో తెలుసుకున్నాను. ఆ సినిమాలో ఓ క్యారెక్టర్ పేరు చివర కర్జాయ్ అని వస్తుంది. ఆ పేరు ఆప్ఘనీస్తాన్ అధ్యక్షునిది కాబట్టి ఆ పేరు తొలగించమన్నారు. ఇది ఓ ఎత్తయితే పొలిటికల్ పార్టీల ప్రభావం మరో ఎత్తు. బుద్ద ఇన్ ట్రాఫిక్ జామ్ చిత్ర సమయంలో ఓ నాయకుడు నానా గొడవ చేశాడు. ఆయన నాసినిమా చూడకుండానే అంతా గొడవ చేశారు. తీరా సినిమా చూశాక తప్పయిందన్నారు. ఓ సినిమాకు రెండు రకాల అడ్డంకులున్నాయిప్పుడు. క్రియేటర్‌కు స్వేచ్ఛ లేదు. సెన్సార్ బోర్డు రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మలా ఉంది. అసలు ఈ సెన్సార్‌షిప్‌నే రద్దుచేయాలని నేను కోరతా.
-వివేక్ అగ్నిహోత్రి, దర్శకుడు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ గురించి చర్చ జరగాల్సి ఉంది. ఎందుకంటే ఓ సినిమా ద్వారా ఓ దర్శకుడు, రచయిత తమ భావాలను వ్యక్తీకరిస్తారు. దానిని అడ్డుకోవడమంటే ప్రాధమిక హక్కును హరించడమే. ఒక్క సినిమాకు మాత్రమే ఎందుకు సెన్సార్షిప్ ఉంటుంది. టీవీకు ఎందుకు కాదు.టీవీ కూడా కలెక్టివ్ వీక్షణ కిందకే వస్తుంది కదా.. ! కొన్ని కోట్ల మంది టీవీలలో ఆయా చిత్రాలను చూస్తారు. అవి వారి మీద ప్రభావం చూపవా ?అలాగని నేను అభ్యంతర కర సన్నివేశాలు సైతం చూపవచ్చనను. ప్రతి ఒక్కరికీ తమ నియంత్రణ గురించి తెలుసు. సెల్ప్ సెన్సార్షిప్ ఉండాల్సిందే. ఈ సెన్సార్ సిస్టమ్ వల్ల అభాగ్యుల గొంతు బయటకు రాకుండా పోతుంది.
-గౌతమ్ ఘోష్, దర్శకుడు సమాజంలో జరిగిన ఉద్యమాలు, జరుగుతున్న సంఘటనలు గురించి చెప్పినా తప్పే అంటున్నారు. ఓ క్రియేటర్ తన భావాలను ప్రజల్లోకి తీసుకువెళ్లకుండా ప్రభుత్వం అడ్డుకోవడమేమిటో నాకర్థం కావడం లేదు. ఎమర్జెన్సీ సమయంలోకూడా ఇంత అరాచకం చూసి ఉండక పోవచ్చు. ఇలా తమకు తోచిన రీతిలో నిషేదం విధిస్తే.. సగటు మానవుని వాయిస్ చేరేదెలా ?
- జయన్ చెరియన్ సెన్సార్ తమ పరిధి దాటి వ్యవహరిస్తుంది. ఇటీవల కేరళలో ఓ దర్శకుడు కథకలి పేరిట ఓ సినిమా తీశాడు. సినిమా చివరలో హీరో ఆత్మహత్య చేసుకోవడానికి కథకలి డ్రెస్ వదిలి.. నదిలోకి వెళ్లిపోతుంటాడు. బ్యాక్ నుంచి అతను నగ్నంగా ఉన్న భ్రమ కల్పిస్తారు. అదిగో ఈ సీన్ తీస్తేనే సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ అంది. సినిమా ముగింపు అది. దానినే తీసేయమంటే ఎలా..? సినిమా ఎలా తీయాలో సెన్సార్ వారే చెబితే బాగుంటుంది. అసలు రీజనల్ కమిటీల లక్ష్యమేమిటో అర్థం కాదు. ప్రతి చిన్న అంశానికి వివాదం రేపుతుంటారు. సెన్సార్ విధానమే కరెక్ట్ కాదు.
- ఉన్నికృష్ణన్, దర్శకుడు - జనరల్ సెక్రటరీ, ఏఐఎస్ఎస్ఏసీ దర్శకుల అభిప్రాయాలను నేను గౌరవిస్తాను. నేను కూడా దర్శకుడినే ! మన భావాలను ఎలా కావాలంటే అలా వ్యక్త పరుస్తామంటే కుదరదు. మనకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. సినిమా అనేది పెద్ద మీడియం. అది చూపే ప్రభావం అపారం. మేం రూల్ బుక్కు అనుగుణంగా మాత్రమే విధులను నిర్వర్తిస్తాం. ఒకవేళరూల్ బుక్మారిస్తే కచ్చితంగా అదే ఫాలో అవుతాం.
ఇటీవల కొన్ని సినిమాలను నిషేదించాం లేదంటే సీన్స్ కట్ చేశామంటే కారణం ఉంది. గాంధీ, నెహ్రూలను ద్రోహులుగా, సెక్స్మానిక్స్గా చూపితే వాటిని ఎలా అంగీకరించగలం. వారు మన జాతినాయకులు. వారిని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు సెన్సార్ తప్పులు చేయవచ్చు. అభ్యంతరం ఉంటే రివైజింగ్ కమిటీ, అక్కడా నచ్చకపోతే కోర్టులు ఉన్నాయి. ప్రతి దానికీ పరిష్కారం మాత్రం ఉంది. - ఉదయ్ శంకర్ పాణి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సభ్యుడు మాభూమి చిత్రం సమయంలో నేను ఎదుర్కొన్న సమస్యలు అనుభవాలతో మళ్లీ ఆ తరహా చిత్రం చేయలేకపోయాను. మనకున్న స్వేచ్చతో ప్రేక్షకులకు ఇబ్బంది కలగనంత వరకూ ఏ కథతోనైనా సినిమాలు తీసుకొవచ్చు. పొలిటికల్ సినిమా అనగానే కాస్త ధైర్యం చెయ్యాలి. బి.నరసింగరావు, దర్శకనిర్మాత. ఫిల్మ్‌మేకర్స్ తమ స్వేచ్చ, ఆలోచన కొద్దీ సినిమాలు తీస్తారు. అది వాళ్ల ఎక్స్ప్రెషన్. సినిమా చూడాలా వద్దా, అది మంచా, చెడా అనేది ప్రేక్షకులు ఇష్టం. సెన్సార్ బోర్డ్ చిన్న విషయానికి కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం కరెక్ట్ కాదు. మహిళా ప్రాధాన్యం గల చిత్రాలు చెయ్యడానికి ఇష్టపడతాను. త్వరలో దేవి అనే సినిమా చెయ్యబోతున్నా. ఇందులో లేడీ దేవదాస్ పాత్రలో కనిపిస్తా. జనవరిలో షూటింగ్ మొదలవుతుంది. పౌలీ దామ్ గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్లో తెలుగు సినిమాకు, పరిశ్రమకు సరైన గౌరవం, ప్రాధాన్యత దక్కిందా? అంటే లేదనే అంటున్నారు తెలుగు సినిమాకు చెందిన పలువురు ప్రముఖులు. ఫిల్మ్ ఫెస్టివల్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన మూడు హాళ్ళకు బాలీవుడ్‌కు చెందిన సత్యజిత్ రే, యశ్‌చోప్రా, ఉపెన్ హజారిక వంటి బాలీవుడ్ దిగ్గజాల పేర్లు కనిపించాయి కానీ తెలుగు సినిమాకు చెందిన ఎన్టీఆర్, ఏయన్నార్, బి.ఎన్.రెడ్డి, కె.వి,రెడ్డి వంటి పేర్లు ఎక్కడా కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







