జై జవాన్!! అంటున్న కాంగ్రెస్
- September 29, 2016
నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం చేపట్టిన మెరుపు దాడిని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అభినందించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన అన్నారు. దేశాన్ని, ప్రజల్ని కాపాడేందుకు భారత సైన్యం చేస్తున్న దానికి కాంగ్రెస్ పార్టీ సెల్యూట్ చేస్తోందన్నారు. ఉగ్రవాదాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దానికి మద్దతు తెలుపుతామని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ వెల్లడించారు. లక్షిత దాడుల గురించి ప్రభుత్వం అన్ని వివరాలు తమకు తెలియజేసిందని, ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇవి కేవలం లక్షిత దాడులు మాత్రమే కాదని, పాకిస్థాన్‌కు ఇదొక హెచ్చరికలాంటిదని చత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ అన్నారు. ఉగ్రదాడులు చేస్తే ఇక సహించేది లేదని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు సాగే సైనిక స్థావరాలు, ఉగ్రవాదులపై సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో విజయం సాధించాలి. భారత సైన్యాన్ని చూసి గర్విస్తున్నాం. మరోసారి సైన్యం తమ ధైర్య సాహసాలను చూపారని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు.
భారత్‌లోకి చొరబడుతున్న ఉగ్రవాదులను నియంత్రించేందుకు భారత సైన్యం గత అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున 4.30 గంటల నుంచి లక్షిత దాడులను చేపట్టిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







