"సిద్ధంగా ఉండండి" - సైన్యానికి పిలుపునిచ్చిన కేంద్రం..
- September 29, 2016
భారత్, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నవేళ భారత ప్రభుత్వం సైన్యానికి సెలవులు రద్దు చేసింది. పాకిస్థాన్ సరిహద్దు వెంబడి తీవ్ర ఉద్రికత్తలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో సెలవులు రద్దు చేసిన ప్రభుత్వం వెంటనే తమ యూనిట్లకు చేరుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే సరిహద్దు వెంబడి అదనపు బలగాలను మోహరించిన ఆర్మీ మరిన్ని బలగాలను మోహరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు సైనికులకు సెలవులు రద్దు చేసింది. ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించినట్టు తెలుస్తోంది. ఆదేశాలు అందుకున్న సైనికులు సమరోత్సాహంతో కదం తొక్కుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమన్న సంకేతానికి గుర్తుని అని నిపుణులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







