హైదరాబాద్‌లో మొదలైన బతుకమ్మ సంబరాలు
- September 29, 2016
హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో గురువారం బతుకమ్మ సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక హనుమాన్ దేవాలయం సమీపంలోని మైదానంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలుబతుకమ్మలతో ప్రదర్శనగా వచ్చి ఆడి, పాడారు. అంతకు ముందు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొబ్బరికాయ కొట్టి వేడుకలను ప్రారంభించారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరళ్ల శారద బతుకమ్మతో వచ్చి మహిళలతో ఆడి పాడారు. ఈ సందర్భంగా సావిత్రమ్మ రాసిన బతుకమ్మ పాటల పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం మహిళలు వూరేగింపుగా వెళ్లి రంగదాముని చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







