చిన్నారులు కోలుకోవాలని ఆకాంక్షించిన షేక్ మొహమ్మద్
- September 29, 2016
అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ చిన్నారులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ముసాఫాలో జరిగిన ప్రమాదం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామనే భరోసా ఇచ్చారు. అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ కోర్ట్ టీమ్, గాయపడ్డ విద్యార్థుల్ని అల్ ముఫ్రాక్ హాస్పిటల్‌లో పరామర్శించారు. స్కూల్ బస్సుల్లో ప్రయాణిస్తున్న విద్యార్థులతోపాటు, ఆ బస్సులు ఢీకొన్న పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాహనంలోనూ కొందరు గాయాలపాలయ్యారు. ప్రమాదాన్ని డ్రైవర్ పసిగట్టినా, వాహనాన్ని అదుపు చేయడానికి తగినంత దూరం ముందున్న వాహనంతో మెయిన్‌టెయిన్ చేయకపోవడం ఈ ప్రమాదానికి కారణంగా గుర్తించారు. రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రతి ఒక్కరూ బాద్యతగా మెలగాలని ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్ చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణ విషయంలో మరింత సమర్థవంతంగా వ్యవహరించాలని సంబంధిత వర్గాలకు క్రౌన్ ప్రిన్స్ ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







