ఫుజారియాలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ లైసెన్సులు

- September 30, 2016 , by Maagulf
ఫుజారియాలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ లైసెన్సులు

ఫుజారియా: ఫుజారియా మునిసిపాలిటీ, 'మై ప్రాజెక్ట్‌' పేరుతో లైసెన్సుల్ని మంజూరు చేసింది. మునిసిపాలిటీ పరిధిలోని పౌరులు, తమ బిజినెస్‌ యాక్టివిటీస్‌ని ఇంటి నుంచే కొనసాగించేందుకు వీలుగా ఈ సౌకర్యాన్ని కల్పించారు. ఫుజారియా క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ హమాద్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ షర్కి నిర్ణయం మేరకు ఈ 'మై ప్రాజెక్ట్‌ లైసెన్స్‌' కార్యరూపం దాల్చింది. 17 లైసెన్సుల్ని రికార్డు సమయంలో మంజూరు చేసినట్లు మునిసిపాలిటీ డిప్యూటీ డైరెక్టర్‌ అబ్దుల్లా అల్‌ హంతోబి చెప్పారు. మీల్స్‌, కాన్‌ఫెక్షనరీ, క్లాతింగ్‌ వంటి విభాగాల్లో ఈ లైసెన్సుల్ని మంజూరు చేశారు. ఈ విధానం ద్వారా నేషనల్‌ ఎకానమీని పెంచడానికి వీలవుతుందనీ, అలాగే పౌరులకు ఆర్థిక బలం చేకూరేందుకు దోహదపడుతుందని అబ్దుల్లా అల్‌ హంతోబి వివరించారు. లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునేవారు ఖచ్చితంగా ఫుజారియాలో నివసించే సిటిజన్‌ అయి ఉండాలి. 21 ఏళ్ళ పైబడి ఉండాలి. లైసెన్సుల్ని ఇతరులకు లీజుకు ఇచ్చేందుకు వీలు లేదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com