పాకిస్థాన్‌లో భారత సినిమాల నిలిపివేత..
- September 30, 2016
నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం చేపట్టిన లక్షిత దాడుల ఫలితంగా పాకిస్థాన్‌లో ప్రస్తుతం ఆడుతున్న భారతీయ సినిమాలన్నీ నిలిపివేశారు. లాహోర్ సూపర్‌సినిమా యాజమాన్యం భారత సినిమాలన్నీ నిలిపివేయనున్నట్లు ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించిన వెంటనే కరాచీ న్యూప్లిక్స్ సినిమాస్ కూడా అదే పద్ధతిని అనుసరించింది. దాంతో భారత సినిమాల ప్రదర్శనలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఈ రెండు థియేటర్లలో హాలీవుడ్ సినిమాలతో పాటు అమితాబ్ నటించిన పింక్ చిత్రం ఆడుతోంది. ఈ రెండు థియేటర్లు తమ నిర్ణయాలు వెల్లడించడంతో మిగతా థియేటర్లు కూడా భారత సినిమాల స్క్రీనింగ్‌లు నిలిపివేయనున్నాయి.
ఇదివరకు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పాక్ నటీనటులను దేశం విడిచి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించింది. ఆ తర్వాత ఐఎమ్‌పీపీఏ(ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్) పాకిస్థాన్‌కి చెందిన నటీనటులను నిషేధిస్తున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







