నవాజ్‌ షరీఫ్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు..

- September 30, 2016 , by Maagulf
నవాజ్‌ షరీఫ్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు..

పాకిస్తాన్ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఆక్రమిత కశ్మీర్‌లో దాడులపై చర్చించారు. భారత్‌ను ధీటుగా ఎదుర్కోవాలని పాక్‌ కేబినెట్‌ నిర్ణయించింది. కశ్మీర్‌లో భారత్ అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపించింది. వాటిని ప్రపంచదేశాలముందు ఉంచుతామని నవాజ్‌ షరీఫ్‌ తెలిపారు. దౌత్యపరంగానూ, భౌతికంగానూ భారత్‌కు ధీటైన సమాధానం ఇస్తామని అన్నారు. ఇందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని పాక్‌ ప్రధాని ప్రకటించారు. భారత్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని పాక్‌ రక్షణ మంత్రి మండిపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com