శ్రీనగర్ పట్టణంలో తిరిగి కర్ఫ్యూ ....
- September 30, 2016
శ్రీనగర్ పట్టణంలో శుక్రవారం తిరిగి కర్ఫ్యూ విధించారు. కశ్మీర్‌లోని లాల్‌చౌక్‌ను స్వాధీనం చేసుకుంటామని వేర్పాటువాదులు ప్రకటించడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కర్ఫ్యూ విధించినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం గొడవలు జరగకుండా శ్రీనగర్ డౌన్‌టౌన్‌లోని 5 పోలీస్స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు. ఈ క్రమంలో లాల్‌చౌక్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు చర్యలు తీసుకున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, పాఠశాలలు మూతపడ్డాయి. కశ్మీర్‌లోని మిగతా ప్రాంతాల్లో శాంతి భద్రతలు అదుపులో ఉంచేందుకు 144 సెక్షన్‌ను విధించారు.గత రెండు నెలలుగా కశ్మీర్లో జరిగిన అలర్లలో ఇద్దరు భద్రతా సిబ్బంది సహా 82 మంది మరణించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







