శ్రీనగర్‌ పట్టణంలో తిరిగి కర్ఫ్యూ ....

- September 30, 2016 , by Maagulf
శ్రీనగర్‌ పట్టణంలో తిరిగి కర్ఫ్యూ ....

 శ్రీనగర్‌ పట్టణంలో శుక్రవారం తిరిగి కర్ఫ్యూ విధించారు. కశ్మీర్‌లోని లాల్‌చౌక్‌ను స్వాధీనం చేసుకుంటామని వేర్పాటువాదులు ప్రకటించడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కర్ఫ్యూ విధించినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం గొడవలు జరగకుండా శ్రీనగర్‌ డౌన్‌టౌన్‌లోని 5 పోలీస్‌స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు. ఈ క్రమంలో లాల్‌చౌక్‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు చర్యలు తీసుకున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, పాఠశాలలు మూతపడ్డాయి. కశ్మీర్‌లోని మిగతా ప్రాంతాల్లో శాంతి భద్రతలు అదుపులో ఉంచేందుకు 144 సెక్షన్‌ను విధించారు.గత రెండు నెలలుగా కశ్మీర్‌లో జరిగిన అలర్లలో ఇద్దరు భద్రతా సిబ్బంది సహా 82 మంది మరణించిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com