అక్టోబర్ 2న గాంధీ జయంతి శుభాకాంక్షలతో వంగవీటి ట్రైలర్ విడుదల..
- October 01, 2016
టాలీవుడ్ లో సంచలనాలకు మరో పేరు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఈ దర్శకుడు విజయవాడకు చెందిన వంగవీటి రంగా లైఫ్ పై వంగవీటి టైటిల్ తో సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. విజయవాడలో రౌడీయిజం ఎలా ఉండేదీ వర్మ తన సినిమాలో చూపించవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి పోస్టర్స్ , సాంగ్స్ విడుదల చేసిన వర్మ అక్టోబర్ 2న గాంధీ జయంతి శుభాకాంక్షలతో సాయంత్రం 5గం.లకు ట్రైలర్ విడుదల చేయబోతున్నట్టు పోస్టర్ ద్వారా తెలియజేశాడు. ఇప్పటికే నటీనటుల సెలెక్షన్ కూడా పూర్తి కాగా.. హ్యాపీడేస్ ఫేం వంశీ చాగంటి దేవినేని మురళి పాత్రను పోషిస్తున్నాడు. నటుడు సందీప్ వంగవీటి రంగా పాత్రలో కనిపించనున్నాడు. వంగవీటి చిత్రం 1970-80లో విజయవాడ నేపథ్యంలో జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో తెరకెక్కుతుంది.ఈ మూవీ శాంతి యుతంగా ఉంటుందని ఇప్పటికే వర్మ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. మరి ఆ సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చిందో, ఏ దశలో ఉందో , ఎప్పుడు రిలీజ్ చేస్తాడో అనే విషయాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









