కార్మికులే రన్‌-ఓవర్‌ ఘటనల్లో బాధితులు

- October 01, 2016 , by Maagulf
కార్మికులే రన్‌-ఓవర్‌ ఘటనల్లో బాధితులు

దోహా: ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌ నివేదికల ప్రకారం రన్‌ ఓవర్‌ ఘటనల్లో ఎక్కువగా రాత్రి వేళల్లో, అందునా వింటర్‌ సీజన్‌లోనే జరుగుతున్నట్లు తేలింది. ఇండఇఃస్టయల్‌ ఏరియా, సల్వా రోడ్‌ ప్రాంతాల్లో ఈ ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఇండస్ట్రియల్‌ ఏరియాలో కార్మికులు, సల్వా రోడ్‌లో షాపర్స్‌ రోడ్డు ప్రమాద బాధితులవుతున్నారు. తక్కువ ఆదాయం గల కార్మికులు రన్‌ ఓవర్‌ ఘటనల్లో ఎక్కువగా బాధిలవుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది 49 మంది పాదచారులు ప్రాణాలు కోల్పోగా, ఈ ఏడాది ఇప్పటిదాకా 37 మంది మృతి చెందారు. 70 శాతం మంది కార్మికులు ఇండస్ట్రియల్‌ ఏరియాలో నివసిస్తూ, అక్కడే పనిచేస్తుంటారనీ, వాహనదారుల నిర్లక్ష్యంతోపాటుగా కార్మికులు కూడా బాధ్యతారహితంగా రోడ్లపై నడుస్తుండడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. వాహనదారుల్లో అవగాహన పెంచడం, అలాగే పాదచారుల్లో అవగాహన పెంచడం వల్ల మాత్రమే వాహన ప్రమాదాల్ని నియంత్రించగలుగుతామని అధికారులు చెప్పారు. తగిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, నిర్లక్ష్యమే నిండు ప్రాణాల్ని బలిగొంటోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా పాదచారులు, వాహనదారులు రోడ్డుపై వెళుతున్న సమయంలో మొబైల్‌ ఫోన్లలో మాట్లాడుతుండడం ప్రమాదాలకు కారణమవుతున్నట్లు తేలింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com