పాక్‌లో భారత టెలివిజన్ ఛానెళ్లపై నిషేధం!
- October 01, 2016
పాకిస్థాన్‌లో ప్రసారమవుతున్న భారత టెలివిజన్ ఛానల్స్‌ను ఈ నెల 15నుంచి నిషేధిస్తున్నట్లు పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ ప్రకటించింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎలాంటి అనుమతులు లేకుండా శాటిలైట్ లింక్ ద్వారా భారత టీవీ ఛానెళ్లు ప్రసారమౌతున్నట్లు తమకు ఫిర్యాదులు అందినట్లు వెల్లడించింది. ప్రస్తుత భారత్, పాక్ సంబంధాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే భారత చానల్స్‌ను ప్రసారం చేస్తున్న డిష్, డీటీహెచ్లపై నిషేధం విధించాలని కొంతమేర వాదనలు వెల్లువెత్తినట్లు తెలుస్తోంది. భారత్‌లో పాక్ కళాకారులపై నిషేధం విధించాలన్న డిమాండ్‌ను ముంబయిలోని కొన్ని రాజకీయపార్టీలు లేవనెత్తడంతో క్రమంగా ఒక్కో అంశంపై ఇరుదేశాలు మధ్య అగ్గిరాజుకుంటోంది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







