హీరో సుధీర్ బాబు గోపిచంద్ పాత్రలో
- October 02, 2016
బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తున్న బయోపిక్ ల ఫీవర్ ఇప్పుడు సౌత్ లో కూడా కనిపిస్తోంది. ఇటీవల ఒలిపింక్ మెడల్ తో సత్తా చాటిన పివి సింధూ కోచ్, గోపిచంద్ జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలం క్రితమే ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ అయినా.. వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా గోపిచంద్ కు జాతీయ స్థాయిలో భారీ క్రేజ్ ఏర్పడటంతో ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు చిత్రయూనిట్. అందుకే వీలైనంత త్వరగా ఈ సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డారు.స్వతహాగా బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన యంగ్ హీరో సుధీర్ బాబు గోపిచంద్ పాత్రలో నటిస్తుండగా, సీనియర్ నటి రేవతి గోపిచంద్ తల్లిగా నటిస్తోంది.ఈ సినిమాను ఏకంగా నాలుగు భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముందుగా తెలుగు, ఇంగ్లీష్ భాషల్లోనే ప్లాన్ చేసిన ప్రస్తుతం గోపి క్రేజ్ దృష్ట్యా హిందీలోనూ రిలీజ్ చేస్తే బెటర్ అని భావిస్తున్నారు. అదే సమయంలో తమిళంలోకి డబ్ చేసే ఆలోచన కూడా చేస్తున్నారట. ఇలా ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో గోపిచంద్ బయోపిక్ ను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







