గుంటూరులో స్వరస్వతి పురస్కారాన్ని అందుకోవడం పూర్వజన్మ సుకృతం : గీతా మాధురి
- October 02, 2016
ఎందరో కళాకారులు జన్మించిన గుంటూరులో స్వరస్వతి పురస్కారాన్ని అందుకోవడం పూర్వజన్మ సుకృతం అని గాయని గీతా మాధురి అన్నారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కళాదర్బార్ అమరావతి, ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ సంయుక్త ఆధ ్వర్యంలో ఆదివారం గాయని గీతామాధురికి స్వరసరస్వతి పురస్కారం ప్రదానం చేశారు. సభకు కళాదర్బార్ అధ్యక్షుడు పొత్తూరి రంగారావు అధ్యక్షత వహించారు. పురస్కార గ్రహీత గీతామాధురి మాట్లాడుతూ పదేళ్లుగా గాయనిగా ఎదగడానికి అభిమానుల ప్రోత్సాహమే కారణమన్నారు. కళాకారులను గుర్తించి ఆదరిస్తున్న కళాదర్బార్ సంస్థ కళాసేవ అభినందనీయమన్నారు. సభలో ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, మార్కెట్ యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు, టీడీపీ నాయకులు మద్దాళి గిరిధర్, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, గంటా పున్నారావు, బిజిలేపల్లి మోహనరావు తదితరులు గీతామాధురిని స్వర సరస్వతి పురస్కారంతో సత్కరించారు.అలరించిన సినీ సంగీత విభావరి గాయని గీతామాధురి, రేఖ, పూజ, అమ్మపండు, రమణలు తమ గాత్ర ధారణలో పలు గీతాలను ఆలపించారు. కీబోర్డుపై అశోక్, తబలపై విజయపాల్, పాడ్స్ చంద్ర, రవి, జాజ్‌పై సూరి వాద్య సహకారం అందించారు.
తాజా వార్తలు
- మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- భారత్-కివీస్ టీ20 ఫైనల్..
- మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్
- ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్
- 6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్‌కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!









