యాంటీ కరప్షన్ కోర్స్ ప్రారంభం
- October 03, 2016
దోహా: ప్రైమ్ మినిస్టర్ మరియు ఇంటీరియర్ మినిస్టర్ షేక్ అబ్దుల్లా బిన్ నాజర్ బిన్ ఖలీఫా అల్ థని, కర్ప్షన్ - లా మరియు గవర్నెన్స్‌లో మాస్టర్ ప్రోగ్రామ్ని ప్రారంభించారు. ఖతార్‌లో అలాగే రీజియన్‌లో ఈ తరహా కోర్స్ ఇదే ప్రధమం. సెంట్ రెజిస్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఈ కోర్స్‌ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ది రూల్ ఆఫ్ లా అండ్ యాంటీ కరప్షన్ (ఆర్ఓఎల్ఎసిసి) దోహాలో ఈ ప్రోగ్రామ్ని, సస్సెక్స్ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ కరప్షన్ - యూనివర్సిటీ ఆఫ్ సస్సెక్స్, యూకే ద్వారా ప్రవేశపెడుతోంది. ఎల్ఎల్ఎం ఇన్ కరప్షన్, లా మరియు గవర్నెన్స్ పార్ట్ టైమ్ కోర్స్. ప్రభుత్వ సెక్టార్ కమర్షియల్ సెక్టార్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్‌లో పనిచేస్తున్న ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్ ఈ కోర్స్‌లో విద్యార్థులుగా చేరే అవకాశం ఉంది. మొదటగా 20 మందితో (12 మంది జాతీయులు), తర్వాత 30 మందితో, ఆ తర్వాత 40 మందితో ఈ కోర్స్‌ని కొనసాగించనున్నారు. దేశంలో అవినీతికి వ్యతిరేకంగా ఖతార్ ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటోందనీ, అవినీతి రహిత పాలన ఖతార్‌లో కొనసాగుతోందని ఆర్ఓఎల్ఎసిసి బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అటార్నీ జనరల్ మరియు ఛైర్మన్ డాక్టర్ అలి బిన్ ఫెతైస్ అల్ మర్రి చెప్పారు. యూకేలో యూనివర్సిటీ ఆఫ్ సస్సెక్స్ టాప్ 10 యూనివర్సిటీల్లో ఒకటి అని ప్రొఫెసర్ మిఖాయిల్ దేవీస్ చెప్పారు. యూకేలో బోధన జరిగినట్లే దోహాలోనూ బోధన జరుగుతుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







