మహిళపై వ్యభిచారం ఆరోపణలు - ఇద్దరికి జైలు శిక్ష
- October 03, 2016
జెడ్డా: ఇద్దరు వ్యక్తులు, ఓ మహిళపై అకారణంగా వ్యభిచారం ఆరోపణలు చేసినందుకుగాను క్రిమినల్ కోర్ట్ జడ్జ్ ఆ ఇద్దరికీ 80 రోజులపాటు జైలు శిక్ష విధించారు. కేసు వివరాల్లోకి వెళితే, తన భార్య నుంచి తన పిల్లల్ని వేరు చేసి, తనకు అప్పగించాల్సిందిగా ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా, ఆ వ్యక్తి తన భార్య వ్యభిచారం చేస్తోందని ఆరోపించాడు. అయితే ఆ వ్యక్తి చెప్పిన మాటల్ని ప్రాసిక్యూటర్ విశ్వసించలేదు. ఆయన చూపిన ఆధారాలు సైతం అనుమానాస్పదంగా ఉన్నాయి. ఇంకో వైపున బాధితురాలి తరఫు లాయర్, తన క్లయింట్ తరఫున వాదనల్ని వినిపించారు. అయితే ఆధారాల్ని చూపే క్రమంలో ఆ భర్త ఇద్దరు వ్యక్తులతో సాక్ష్యాలు ఇప్పించగా, వాటిని న్యాయమూర్తి తిరస్కరించారు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపర్చేలా, వారిపై అభాండాలు మోపాలనుకునేవారికి ఈ తీర్పు చెంపదెబ్బ లాంటిదని బాధితుఆలి తరఫు లాయర్ బాదర్ అల్ షాత్రి చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







