ఎయిర్ ఏసియా ఇండియా కొత్త ఆఫర్
- October 03, 2016
సంవత్సరం చివరలో ఎయిర్ ఏసియా ఇండియా కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద టిక్కెట్లను రూ.899లకే విక్రయించనుంది. అక్టోబర్ 16తో ఈ ఆఫర్ ముగుస్తుంది. 2016 అక్టోబరు 4 నుంచి 2017 ఏప్రిల్ 27 మధ్య ప్రయాణాలకు ఈ ఆఫర్ కింద టికెట్లు కొనుక్కోవచ్చని ఎయిర్ ఏసియా తెలిపింది. రూ. 899 టికెట్ గౌహతి-ఇంఫాల్ మధ్య ప్రయాణానికి వర్తిస్తుంది. బెంగుళూరు-కొచ్చి టిక్కెట్టు ధర రూ.999లుగా సంస్థ ప్రకటించింది.
ఈ ఆఫర్‌లో భాగంగా బెంగళూరు-గోవా టిక్కెట్టు ధర రూ.1,199, బెంగళూరు-చండీగఢ్ రూ.3,399, గోవా-హైదరాబాద్ రూ.1,799, జైపూర్-పుణె రూ.2,399, దిల్లీ-బెంగుళూరు రూ.2,699లుగా ఉంది.
అక్టోబర్ 8 నుంచి కొచ్చి నుంచి హైదరాబాద్‌కు విమాన సర్వీసును నడపనున్నట్లు ఎయిర్ ఏసియా తెలిపింది. టిక్కెట్టు ధర రూ. 2,699 గా నిర్ణయించారు. చాలా విమాన సంస్థలు గతంలోనే తగ్గింపు ధరలను ఇవ్వడానికి ముందుకు వచ్చాయి.
దాంతో ఆగస్టులో విమాన ప్రయాణికులు 24 శాతం పెరిగారు.
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









