ఉలవల పచ్చడి
- October 03, 2016
కావలసిన పదార్థాలు: ఉలవలు - ముప్పావు కప్పు, ఉల్లిపాయ తరుగు - 1 కప్పు, ఆవాలు, జీలకర్ర - అర టీ స్పూను చొప్పున, దనియాలు - 1 టేబుల్ స్పూను, ఎండుమిర్చి - 5, కరివేపాకు - 4 రెబ్బలు, నువ్వుల నూనె - 1 టేబుల్ స్పూను, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: ఉలవల్ని 2 గంటలసేపు నానబెట్టి రెండు కప్పుల నీటితో కుక్కర్లో ఉడికించాలి. ఉడికిన ఉలవలను వడ కట్టి ఆ నీటిని ఒక గిన్నెలో పక్కనుంచాలి. కడాయిలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, దనియాలు, ఉల్లి తరుగు ఒకటి తర్వాత ఒకటి దోరగా వేగించాలి. తాలింపు చల్లబడ్డాక ఉలవలతో పాటు తగినంత ఉప్పు చేర్చి, వడకట్టి పక్కనుంచిన నీరు చిలకరిస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









