అలెప్పో పేలుళ్ళలో క్యుఆర్‌సిఎస్‌ హాస్పిటల్‌ ధ్వంసం

- October 04, 2016 , by Maagulf
అలెప్పో పేలుళ్ళలో క్యుఆర్‌సిఎస్‌ హాస్పిటల్‌ ధ్వంసం

దోహా: అలెప్పోలో జరిగిన దాడిలో ఖతార్‌ రెడ్‌ క్రిసెంట్‌ సొసైటీ (క్యుఆర్‌సిఎస్‌) నిర్వహిస్తున్న ప్రైమరీ హెల్త్‌ కేర్‌ సెంటర్‌ ధ్వంసమయ్యింది. అల్‌ సఖూర్‌ ఏరియాలో ఈ హెల్త్‌ సెంటర్‌ నిర్వహించబడ్తోంది. ఈ దాడుల్లో ఇద్దరు చనిపోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. హెలికాప్టర్‌ ద్వారా విడిచిన నాలుగు బాంబులు తీవ్రమైన విధ్వంసాన్ని మిగిల్చాయి. 50 శాతం మెడికల్‌ సెంటర్‌ ఈ దాడుల్లో ధ్వంసమయినట్లు క్యుఆర్‌సిఎస్‌ వర్గాలు వెల్లడించాయి. దాడి కారణంగా, హెల్త్‌ సెంటర్‌ పూర్తిగా మూసివేయబడింది. క్యుఆర్‌సిఎస్‌ ఈ దాడుల్ని తీవ్రంగా ఖండించింది. సిరియాలో క్యుఆర్‌సిఎస్‌ ఏర్పాటు చేసిన హెల్త్‌ సెంటర్స్‌లో ఇది కూడా ఒకటి. ఈ దాడిని యుద్ధ నేరంగా పరిగణించాలని క్యుఆర్‌సిఎస్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌ హెడ్‌ - మిషన్‌ ఇన్‌ టర్కీ - డాక్టర్‌ హషీమ్‌ దార్విష్‌ డిమాండ్‌ చేశారు. ఏప్రిల్‌లో ఈ కేంద్రం ఏర్పాటయ్యింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com