అక్టోబర్ 16 నుంచి ఖతార్‌లో రెయినీ సీజన్
- October 04, 2016
అక్టోబర్ 16న కతార్‌లో రెయినీ సీజన్ సీజన్ ప్రారంభం కానుంది. 52 రోజులపాటు ఈ సీజన్ కొనసాగనుందని ఖతార్ మెటియరాలజీ డిపార్ట్మెంట్ ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. అక్టోబర్ 16కి ముందే వర్షాలు దేశంలో కురవవచ్చునని అంచనా వేస్తున్నారు. వర్షాకాలం సందర్భంగా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టనున్నాయి. 30 నుంచి 35 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు ఉండొచ్చు. వర్షాలు పొంచి ఉన్నందున సంబంధిత శాఖలు ముందస్తుగా తగిన జాగ్రత్తలు చేపట్టాల్సి ఉందని మెటియరాలజీ డిపార్ట్మెంట్ సూచించింది. ఇదిలా ఉండగా మినిమమ్ టెంపరేచర్ ఇప్పటికే 20 డిగ్రీల సెంటిగ్రేడ్ కిందకి పడిపోయింది మెసైయీద్, తురాయానా, అబు సమ్రా ప్రాంతాల్లో. అల్ ఖోర్, వక్రా, మెసైయాద్లలో గురువారం 18 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకూ అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చునని వెదర్ రిపోర్ట్ చెబుతోంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







