సెల్వ కన్నన్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించిన అదితి.....
- October 04, 2016
ఓ దర్శకుడి వేధింపులు తట్టుకోలేక నటి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మళయాళంలో పలు సీరియల్స్ లో నటించిన అదితి అలియాస్ అథిరా సంతోష్ తమిళ చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమైంది. అయితే ఆ సినిమా డైరక్టర్ సెల్వ కన్నన్ నుంచి ఆమె లైంగిక వేధింపులు ఎదుర్కొంది. శారీరకంగా మానసికంగా వేధిస్తుండేవాడు. ఈ వేధింపులు తట్టుకోలేక సెప్టెంబరు 29 న ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు వార్తలు కూడా వచ్చాయి. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సినిమా మొదలైన నాటి నుంచి సెల్వకన్నన్ తనను వేధిస్తున్నాడని, పదే పదే తనను ప్రేమిస్తున్నానంటూ వెంట పడేవాడని, ప్రేమను నిరాకరిస్తే బెదిరించాడని తెలిసింది. వేధింపులు ఎక్కువయ్యాయని అటు పోలీసులకు, ఇటు నడిగర్ సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయింది.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







