ఖతార్‌కి మందులు తీసుకెళ్తున్నారా? జాగ్రత్త!
- October 05, 2016
ఖతార్‌కి వెళ్ళేవారు తమతోపాటు కొన్ని మందుల్ని తీసుకెళ్ళడం మామూలే. చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఏ దేశానికి వెళ్ళినా మందుల్ని తీసుకెళుతుంటారు. అయితే ఆయా దేశాల్లో కొన్ని మందుల పట్ల నిషేధం ఉంటుంది. ఖతార్ కూడా అంతే. తగిన ప్రిస్క్రిప్షన్ని తమతో తీసుకెళితే, కొన్ని మందుల్ని దేశంలోకి అనుమతిస్తారు. హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌తోపాటు అబు సమ్రా ల్యాండ్ బోర్డర్లో వైద్యుల్ని అందుబాటులో ఉంచామనీ, ఆ వైద్యులు ఆయా మందుల్ని పరీక్షిస్తారని అధికారులు తెలిపారు. ట్రమడాల్ వంటి మందుల్ని ఖతార్‌లో నిషేధిస్తారు. అయితే తగిన ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే, కస్టమ్స్ అధికారులు అలాగే, పార్మసీ అండ్ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అధికారులు వాటిని పరిశీలించి, దేశంలోకి అనుమతించే విషయాన్ని పరిశీలిస్తారని హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అజబ్ మనుర్ అల్ కహ్తాని చెప్పారు. హెర్బల్ మెడిసిన్స్ విషయంలో ఎక్కువగా అభ్యంతరాలు వ్యక్తమవుతుంటాయి. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 3 వరకు మొత్తం 731 నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి ఈ మందుల విషయంలో.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







