షార్జా బిల్డింగ్‌లోకి దూసుకెళ్ళిన ట్రక్: నలుగురికి గాయాలు
- October 06, 2016
షార్జా: నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డ ఘటన షార్జాలో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి ఓ ట్రక్కు వేగంగా దూసుకొచ్చి, ఓ బిల్డింగ్‌ని ఢీకొందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న చాలా దుకాణాల్ని, అలాగే వాహనాల్ని ఆ ట్రక్ ధ్వంసం చేసినట్లు వారు చెప్పారు. ప్రమాదం గురించి తెలియగానే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలంలోనే ఓ షాపులో హెల్పర్‌గా పనిచేస్తున్న సునీల్ అనే వ్యక్తి సంఘటన గురించి వివరిస్తూ, డిన్నర్ తర్వాత తాను నడుచుకుంటూ వెళుతుండగా, భారీ శబ్దం చోటు చేసుకుందని, వెళ్ళి చూస్తే అక్కడ ప్రమాదం జరిగిందని అన్నాడు. గాయపడ్డవారిని అంబులెన్స్‌లో తరలించారు. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







