అటామా సరిహద్దు క్రాసింగ్ వద్ద పేలుడు.....
- October 06, 2016
టర్కీ-సిరియా సరిహద్దు ప్రాంతంలో గురువారం సంభవించిన భారీ పేలుడులో కనీసం 40 మంది మరణించినట్లు అల్ మయాదీన్ టీవీ ఛానల్ వెల్లడించింది. అటామా సరిహద్దు క్రాసింగ్ వద్ద సిరియా తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు జరిగిందని ఈ టీవీ ఛానల్ తన వార్తా కథనంలో వివరించింది. ఈ పేలుడుకు తామే బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) మిలిటెంట్ గ్రూప్ తమ ఆత్మాహుతి దళ సభ్యుడొకరు పేలుడు పదార్ధాలతో నిండిన కారుతో సరిహద్దు ప్రాంతం వద్ద దాడి చేసినట్లు వెల్లడించింది. ఈ సరిహద్దు ప్రాంతం సిరియా ఉత్తరాన వున్న ఇడ్లిబ్ ప్రావిన్స్‌లో వుంది. తొలుత ఈ దాడిలో 20 మంది రెబల్స్ ప్రాణాలు కోల్పోయినట్లు లండన్‌కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!







