నీయామీశరణార్థుల శిబిరం వద్ద కాపలాగా ఉన్న సైనికులపై ఉగ్రవాదుల దాడి..
- October 06, 2016
శరణార్థుల శిబిరం వద్ద కాపలాగా ఉన్న సైనికులపై ఉగ్రవాదుల జరిపిన కాల్పుల్లో 22 మంది మృతి చెందారు. ఈ ఘటన నైగర్ పశ్చిమ సరిహద్దు ప్రాంతం టస్సారా వద్ద చోటుచేసుకుంది. మాలి శరణార్దులకు రక్షణ కల్పిస్తున్న సైనికులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని జిన్హువా వార్తాసంస్థ తెలిపింది.అయితే ఈ ఘటనపై నైగర్ ప్రభుత్వం పూర్తి వివరాలను వెల్లడించనప్పటికీ.. నైగర్స్ నేషనల్ టెలివిజన్ గురువారం రాత్రి సైనికులపై దాడి జరిగిన విషయాన్ని ప్రకటించింది. ఈ ఘటనలో భారీ ప్రాణనష్టం జరిగిందని వెల్లడించింది. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం సైనికులు ఆ ప్రాంతమంతా జల్లెడపడుతున్నారు. ఉగ్రవాదులు మాలి ఉత్తరప్రాంతానికి చెందిన వారై ఉంటారని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









