ముప్పు పొంచి ఉన్న విమానాశ్రయాల వద్ద భద్రత..

- October 07, 2016 , by Maagulf
ముప్పు పొంచి ఉన్న విమానాశ్రయాల వద్ద భద్రత..

దేశరాజధాని దిల్లీ సహా 22 నగరాల్లో విమానాశ్రయాలకు ఉగ్రముప్పు పొంచివుందని నిఘావర్గాలు హెచ్చరించాయి. ముప్పు పొంచి ఉన్న విమానాశ్రయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని కేంద్రానికి నిఘా వర్గాలు సూచించాయి. పాకిస్థాన్‌తో సరిహద్దు ఉన్న జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లోని 22 విమానాశ్రయాలకు ముప్పు పొంచి ఉన్నట్లు నిఘావర్గాలు పేర్కొన్నాయి. దీంతో ప్రయాణికుల బ్యాగులతోపాటు పార్కింగ్‌ ప్రదేశాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరింత పటిష్ఠ భద్రత కల్పించాలని కోరుతూ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ బ్యూరో ఇప్పటికే ఆయా రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులకు లేఖలు రాసింది.గురురువారం ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ సమావేశమై నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితులను వివరించారు. నిఘా వర్గాల సమాచారం మేరకు సుమారు 100 మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని దోవల్‌ ప్రధానికి తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com