'సీక్రెట్‌ కన్వర్‌జేషన్‌' ఫీచర్‌ను అందుబాటులోకి ...

- October 07, 2016 , by Maagulf
'సీక్రెట్‌ కన్వర్‌జేషన్‌' ఫీచర్‌ను అందుబాటులోకి ...

ఆర్థిక లావాదేవీల వివరాలను, వ్యక్తిగత అంశాలను అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులతోనే పంచుకుంటాం. కానీ.. సోషల్‌మీడియా సైట్లలో ఛాటింగ్‌ ద్వారా అలాంటి విషయాలను పంచుకోవడం ఏమాత్రం మంచిది కాదన్నది నిపుణుల సూచన. ఎందుకంటే.. మనకు తెలియకుండానే హ్యాకర్లు, గూఢచార సంస్థలు మన విలువైన సమాచారాన్ని దొంగలించే అవకాశం చాలా ఎక్కువ. ఇక నుంచి ఆ భయం అక్కర్లేదంటోంది ఫేస్‌బుక్‌. అందుకోసం మెసెంజర్‌ యాప్‌లో 'సీక్రెట్‌ కన్వర్‌జేషన్‌' ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
స్నాప్‌చాట్‌.. వాట్సాప్‌.. వైబర్‌ తీసుకొచ్చిన ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ విధానం ఇప్పుడు ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ఇద్దరి మధ్య జరిగే సంభాషణలు మూడో వ్యక్తికి అర్థమయ్యే పరిస్థితి ఉండదు. వాటిని ఫేస్‌బుక్‌ యాజమాన్యానికి.. ప్రభుత్వ నిఘా సంస్థలు కూడా అర్థం చేసుకునే వీలుండదట.

అలాగే 'సీక్రెట్‌ కన్వర్‌జేషన్‌' ఫీచర్‌ను ఎనేబుల్‌ చేస్తే మనం పంపిన మెసేజ్‌లు మనం ఎంచుకున్న కాల వ్యవధిలో డిలీట్‌ అయిపోతాయి. అది ఎంత సమయంలో అంటే సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజుల్లోగా డిలీట్‌ అయ్యేట్లు సెట్‌ చేసుకోవచ్చు. ఈ సదుపాయం తాజాగా విడుదలైన గూగుల్‌ 'అల్లో' యాప్‌లోనూ ఉంది. మరో విశేషమేమిటంటే.. ఒక డివైజ్‌ నుంచి పంపిన మెసేజ్‌లను మరో డివైజ్‌లో లాగిన్‌ అయ్యి చూసుకునే వీలుండదు. ఉదాహరణకు.. స్మార్ట్‌ఫోన్‌లోని ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ ద్వారా జరిపిన సంభాషణలు డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌లో లాగిన్‌ అయ్యి చూస్తే కనిపించవు.ఆండ్రాయిడ్‌.. ఐఓఎస్‌ వెర్షన్‌లో మెసెంజర్‌ యాప్‌ను అప్‌డేట్‌ చేసుకుంటే ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని ఫేస్‌బుక్‌ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com