ఈడు గోల్డ్ ఎహే:రివ్యూ
- October 07, 2016
సినిమా రివ్యూ : ఈడు గోల్డ్ ఎహే
నటీనటులు : సునీల్, సుష్మా రాజ్, రిచా పనాయ్.
సంగీతం : సాగర్ మహతి
దర్శకత్వం : వీరూ పోట్ల
నిర్మాత : రామ బ్రహ్మం సుంకర
విడుదల తేదీ : 07-10-2016
కమెడియన్ నుంచి హీరోగా మారాడు సునీల్. తాజాగా ఆయన నటించిన చిత్రం ఈడు గోల్డ్ ఎహే. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన నాటి నుంచి సినిమాల పై మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా అంచనాలను అందుకుందో లేదో చూద్దాం..
కథ : బంగార్రాజు(సునీల్) నచ్చిన చోట పని చేసుకుంటూ జీవిస్తుంటాడు. ఇంతలో బంగార్రాజు పని చేసే ఇంటి యజమాని ఇబ్బందుల్లో పడడంతో బంగార్రాజును దత్తత తీసుకుంటారు. అంతా ప్రశాంతంగా ఉందునుకున్న తరుణంలోకొంత మంది క్రిమినల్స్ సునీల్ వర్మ అనుకొని బంగార్రాజు వెంట పడతారు.
సునీల్ వర్మ ఎవరు అంటూ అతని కోసం వేట మొదలెడతాడు బంగార్రాజు. మరి సునీల్ వర్మ బంగార్రాజుకి దొరికాడా..? గీత (సుష్మా రాజ్), రిచా పనాయ్ ఎవరు? మహదేవ్‍కి, సునీల్ వర్మకి ఉన్న సంబంధం ఏంటి ..? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ..
సినిమాలో వచ్చే ట్విస్ట్‌లే ఈ సినిమాకి ప్రధాన బలం. ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లలో వచ్చే ట్విస్ట్‌లు అదిరిపోయాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ షాక్ ఇచ్చేలా ఉంది. హీరో సునీల్ తన స్థాయికి తగ్గట్లు కామెడి పంచ్ లతో నవ్వించాడు. షకలక శంకర్, పృథ్వీ , వెన్నెల కిషోర్ లు తమ కామెడితో ఆకట్టుకున్నారు. హీరోయిన్లు సుష్మా రాజ్, రిచా పనాయ్ నటన పరంగా ఫర్వాలేదనిపించినా, అందాల ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఇక హీరో-హీరోయిన్ల లవ్ ట్రాక్ ఆకట్టుకునేలా లేదు. పోసాని కృష్ణ మురళితో పాటు ఇతరత్రా కొన్ని సెపరెట్ కామెడీ ట్రాక్స్ లను కావాలని ఇరికించినట్లు అనిపించింది. విలన్ పాత్ర కూడా ఏ మంత పవర్ పుల్ గా లేదు. స్క్రీన్‌ప్లే విషయంలో దర్శకుడు మరింత జాగ్రత్త పడాల్సి ఉంది. సాగర్ మహతి అందించిన పాటల్లో చెప్పుకోదగ్గ పాటలేవీ లేవు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగా ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ కాస్త మెరుగుపడాలి. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
కామెంట్ః సునీల్ సిల్వర్ ఎహే..
మాగల్ఫ్ రేటింగ్#3/5
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









