నక్షత్రం లోగో లాంచ్ చేసిన చరణ్
- October 08, 2016
గతంలో ప్రకటించినట్టుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా నక్షత్రం చిత్ర టైటిల్ లోగో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ధృవ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న చరణ్, తన సెట్స్ నుంచి ఈ సినిమా లోగోను రిలీజ్ చేశారు. నక్షత్రం చిత్ర దర్శకుడు కృష్ణవంశీతో గతంలో రామ్ చరణ్ హీరోగా 'గోవిందుడు అందరివాడేలే' సినిమాను తెరకెక్కించాడు. ఆ స్నేహంతోనే చెర్రీ కృష్ణవంశీ సినిమా లుక్స్ ను రిలీజ్ చేసేందుకు అంగీకరించాడు.
సందీప్ కిషన్, రెజీనాలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న నక్షత్రం సినిమాలో సాయి ధరమ్ తేజ్, ప్రగ్యాజైస్వాల్ లు అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి పది లుక్స్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసిన కృష్ణవంశీ అన్ని లుక్స్ ను రామ్ చరణ్ చేతులు మీదుగా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.
ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను శ్రీనివాసులు, సజ్జు, వేణుగోపాల్ లు నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







