బుల్లితెరపై నటించనున్న శ్వేతాబసు
- October 08, 2016
కొత్త బంగారు లోకం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై కథానాయికగా మంచి గుర్తింపు తెచుకున్న నటి శ్వేతాబసు ప్రసాద్. ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డు పొందిన ఆమె గత కొద్ది కాలంగా వెండితెరకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె బుల్లితెరపై ప్రసారం కానున్న సీరియల్లో నటిస్తున్నారు. అక్టోబరు 10 నుంచి స్టార్ ప్లస్‌లో ప్రసారం కాబోతున్న సీరియల్లో చంద్రగుప్త మౌర్య భార్య చంద్ర-నందిని అనే పాత్రలో శ్వేత కనిపించనున్నారు. బుల్లితెర అనుభవం గురించి ఆమె మాట్లాడుతూ.. 'నటీనటులకు ఇది ఎగ్జైటింగ్ సమయం. టీవీల్లో షోను బట్టి విభిన్నమైన పాత్రలుంటాయి. ఇప్పుడు వాటిని నేను చేస్తున్నా.టీవీ షోలు ఇతివృత్తం ఆధారంగా చాలా క్లుప్తంగా ఉంటాయి, కథలు విభిన్నంగా ఉంటాయి. టెలివిజన్ నటీనటులకు ఇది చాలా ఎగ్జైటింగ్ సమయం' అన్నారు.
అంతేకాదు చంద్ర-నందిని పాత్ర కోసం శ్వేత తెగ కసరత్తులు చేస్తున్నారట. ఇది యోధురాలైన రాణి పాత్ర కావడంతో దానికి తగ్గట్టు తన శరీరాన్ని మలుచుకుంటున్నట్లు తెలిపారు.
త్వరలో కత్తియుద్ధం, గుర్రపు స్వారీ కూడా నేర్చుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలోనే మగధ, మౌర్య చరిత్రను చదివినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







