11 మంది ఉగ్రవాదులను కాల్చి చంపిన బంగ్లా సైన్యం

- October 08, 2016 , by Maagulf
11 మంది ఉగ్రవాదులను కాల్చి చంపిన బంగ్లా సైన్యం

ఉగ్రవాదులపై బంగ్లాదేశ్‌లోని షేక్ హసీనా సర్కారు విరుచుకుపడుతోంది. 11 మంది ఉగ్రవాదులను బంగ్లా సైన్యం కాల్చి చంపింది. జులైలో ఢాకా కేఫ్‌పై ఉగ్రవాదులు దాడి చేసి 22 మంది విదేశీ పర్యాటకులను చంపేశాక షేక్ హసీనా సర్కారు ఉగ్రవాదులను ఏరిపారేస్తోంది. ఇందులో భాగంగా ఢాకా సమీపంలోని గాజీపూర్‌లోని ఓ భవనంలో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో సైనిక బలగాలు దాడులు జరిపాయి. మరో ఘటన తంగైల్ జిల్లాలో జరిగింది. ఓ మూడంతస్థుల భవనంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో సైన్యం దాడులు జరిపింది. ఘటనా స్థలాల నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలను, అత్యాధునిక ఆయుధాలను సైన్యం స్వాధీనం చేసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com