కొబ్బరి పాలతో వెల్లుల్లి కూర

- October 08, 2016 , by Maagulf
కొబ్బరి పాలతో వెల్లుల్లి కూర

కావలసిన పదార్థాలు: వెల్లుల్లి రేకలు - 20, కొబ్బరి కోరు - 3 టేబుల్‌ స్పూన్లు, కారం- 1 టీ స్పూను, జీరా, దనియా పొడి- 1 స్పూను, పసుపు- పావు టీ స్పూను, దాల్చనచెక్క- అంగుళం ముక్క, మెంతులు- అర టీ స్పూను, బియ్యం - 1టీ స్పూను, చిన్న టమోటా -1, కరివేపాకు - 4 రెబ్బలు, చిక్కటి కొబ్బరిపాలు - అరకప్పు, ఉప్పు - రుచికి తగినంత. 

తయారుచేసే విధానం: వెలుల్లి రేకల పొట్టు తీసి, ముక్కలుగా తరగాలి. కడాయిలో బియ్యం, కొబ్బరికోరు, దాల్చినచెక్క, కారం, పసుపు, జీరా, దనియాలపొడులు సన్నని మంటపై (మాడకుండా) వేగించాలి. తర్వాత మిక్సీలో వేసి టమోటాతో పాటు గ్రైండు చేసుకోవాలి. ఈ పేస్టుని వెల్లుల్లి ముక్కలకు పట్టించి కరివేపాకుతో పాటు కప్పు నీరు పోసి ఉడికించాలి. వెల్లుల్లి ముక్కలు మెత్తబడ్డాక కొబ్బరిపాలు, ఉప్పు వేసి రెండు నిమిషాల తర్వాత దించేయాలి. అన్నంతో పాటు చపాతీల్లో కూడా ఈ కూర బాగుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com