దసరా మరియు బతుకమ్మ ఉత్సవాలు - మస్కట్

- October 09, 2016 , by Maagulf

 

మధ్యప్రాత్య దేశమైన ఒమాన్ దేశ రాజధాని మస్కట్ నగరములో వినూత్నముగా ఎక్కడా కనిపించని విధంగా మొత్తం తెలుగు ప్రజలందరూ సుమారు 1500 పైచిలుకు ఒకదగ్గర సమావేశమై (RUWI – Al MASHA HALL) ఆటపాటలతో భక్తిశ్రద్ధలతో దసరా మరియు బతుకమ్మ ఉత్సవాలను రక్తికట్టించారు. "తెలుగు కమ్యూనిటీ (ఒమాన్)" మరియు "చిరు మెగా యూత్ ఫోర్స్" ఆధ్వర్యంలో కనులవిందుగా మొత్తం తెలుగు ఆడపడుచులు ఆడిపాడి మేమంతా ఒక్కటే 'తెలుగు జాతి - తెలుగు ప్రజలము' అని చాటి చెప్పారు. ఈ కార్యక్రమానికి మీడియా సోదరులు చేసిన సహాయానికి 'చిరు మెగా యూత్ ఫోర్స్' వ్యవస్థాపక అధ్యక్షుడు రామదాసు.చందక ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా సుఖసంతోషములతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాదు నుంచి వర్ధమాన సినీ గాయని "శివప్రియ" ప్రత్యేక ఆకర్షణతో ఆట-పాట చేయించారు. మరీ ముఖ్యంగా మస్కట్ లో ఉన్న రాయబారి కార్యాలయము నుంచి Acting Ambassador శ్రీమతి నీలు వోరా హాజరయ్యారు. ఆమె కూడా తెలుగింటి ఆడపడుచులతో ఆడిపాడారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com