విజయదశమి రోజున 'ధృవ' టీజర్ విడుదల..
- October 09, 2016
పో రాటం చేసేటప్పుడు చేతిలో ఆయుధం ఉండాలనుకొంటారు. అదే బలమని నమ్ముతారు. కానీ ఓ యువ ఐపీయస్ అధికారి మాత్రం ఎదురుగా శత్రువుంటే చాలంటాడు. అన్నిటికంటే శత్రువే తన బలం అంటాడు. మరి అతడి పోరాటం ఎలా సాగిందో తెలియాలంటే 'ధృవ' చూడాల్సిందే. రామ్‌చరణ్ కథానాయకుడిగా గీతా ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కుతోన్న చిత్రమిది. రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయిక. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమిళంలో విజయవంతమైన 'తని ఒరువన్'కి రీమేక్‌గా రూపొందుతోందీ చిత్రం.ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. విజయదశమి రోజున టీజర్‌ని విడుదల చేస్తారు. ''రామ్‌చరణ్ నటననీ, ఆయన స్టైల్‌ని కొత్త తరహాలో ఆవిష్కరించే చిత్రమిది. ప్రతి సన్నివేశం ఆసక్తిని రేకెత్తిస్తుంది.తన శత్రువులపై ఐపీయస్ అధికారి సాధించిన విజయం ప్రేక్షకుల్ని థ్రిల్‌కి గురిచేసేలా ఉంటుంది. చరణ్ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకొని ఈ చిత్రం కోసం సన్నద్ధమై నటించార''ని చిత్రవర్గాలు తెలిపాయి. అరవింద్ స్వామి కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.ఎస్.వినోదం, సంగీతం: హిప్ హాప్ తమిళ
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







