'నక్షత్రం' చిత్రం టైటిల్ లోగో రామ్‌చరణ్ విడుదలచేశారు..
- October 09, 2016
పోలీస్ అవ్వాలనే ప్రయత్నంలో ఉన్న ఓ యువకుడి కథతో 'నక్షత్రం' చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో సందీప్‌కిషన్, రెజీనా నాయకానాయికలు కాగా ప్రత్యేక పాత్రలలో సాయిధరమ్‌తేజ్, ప్రగ్యజైస్వాల్ నటిస్తున్నారు. కృష్ణవంశీ దర్శకుడు. శ్రీ చక్ర మీడియా సారధ్యంలో బుట్టబొమ్మ క్రియేషన్స్ పతాకంపై కె.శ్రీనివాసులు, విన్ విన్ విన్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో శరవేగంగా జరుగుతోంది.కాగా ఈ చిత్రం టైటిల్ లోగో విడుదలైంది. ప్రస్తుతం ధృవ చిత్రంలో నటిస్తున్న రామ్‌చరణ్ అదే సెట్స్‌లో ఈ చిత్రం లోగోను తన చేతులమీదుగా విడుదలచేశారు. ఇదిలావుండగా ఈ చిత్రం తొలి పది ప్రచార చిత్రాలను ప్రణాళికబద్ధంగా తగిన సమయంలో రామ్‌చరణ్ చేతుల విడుదల చేసేందుకు కృష్ణవంశీ సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







