సంప్రదాయ పాస్‌వర్డ్‌లకు కాలం చెల్లినట్టే కనిపిస్తోంది!
- October 09, 2016
సంప్రదాయ పాస్‌వర్డ్‌లకు కాలం చెల్లినట్టే కనిపిస్తోంది! బయోమెట్రిక్, రెటినా లాంటి అధునాతన భద్రతా అంచెలనూ తలదన్నెలా.. సరికొత్త వ్యవస్థను పరిశోధకులు తెరపైకి తీసుకొచ్చారు. మెదడు తరంగాలతో వ్యక్తులను గుర్తించే విధానాన్ని అభివృద్ధి చేశారు. మెదడులోని చర్యలను నమోదుచేసే, పర్యవేక్షించే ఎలక్ట్రోఎన్సెఫాలోగ్రఫీ (ఈఈజీ) ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఈ తరహా భద్రతా వ్యవస్థపై సైబర్ ముఠాలు దాడిచేసే అవకాశం చాలా తక్కువని దీన్ని అభివృద్ధిచేసిన టెక్సాస్ టెక్ వర్సిటీ పరిశోధకులు తెలిపారు. దీంతో అనుసంధానించిన కంప్యూటర్‌పై మనం పని చేస్తున్నప్పుడు.. ఈఈజీలు నిరంతరంగా మన మెదడులోని తరంగాలను నమోదు చేస్తుంటాయి.అత్యవసర సమయాల్లో మనం పక్కకు వెళ్లినప్పుడు ఎవరైనా మన కంప్యూటర్ను ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తే.. వెంటనే లాక్ పడిపోతుంది. స్వచలితంగా తెరచుకునే తలుపులు, వెలిగే లైట్లు, ఫేన్లు తదితర విద్యుత్తు పరికరాలతోపాటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) సాంకేతికతలోనూ ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించే అవకాశముంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







