డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ఆన్‌లైన్‌లోనే
- October 09, 2016
దుబాయ్: దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టిఎ), డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించి నాలుగు సర్వీసులను ఇకపై పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అందిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్, పాడైపోయిన లేదా పోయిన డ్రైవింగ్ లైసెన్సుల్ని తిరిగి మంజూరు చేయడం, డ్రైవర్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ తదితర సౌకర్యాలు ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి రానున్నాయి. వీటిల్లో కొన్ని సర్వీసులు అక్టోబర్ 16 నుంచి, ఇంకొన్ని అక్టోబర్ 30 నుంచి, మరికొన్ని నవంబర్ 13, నవంబర్ 27 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయి. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ 16వ తేదీ నుంచి ఆన్‌లైన్‌కే పరిమితం కానుంది. ఇ-ఛానల్స్, స్మార్ట్ యాప్స్, ఫ్రంట్-ఎండ్ ఎంప్లాయీస్ ద్వారా మాత్రమే ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. స్మార్ట్ దుబాయ్ ప్రాజెక్టు అలాగే అందరికీ ఆనందకరమైన సేవలు అందించే క్రమంలో స్మార్ట్ మూవ్ తీసుకున్నట్లు వారు వివరించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







