చందు మొండేటి వరుణ్ తేజ్ కాంబో ...

- October 09, 2016 , by Maagulf
చందు మొండేటి వరుణ్ తేజ్ కాంబో ...

తాజాగా నాగచైతన్య హీరోగా రూపొందించిన 'ప్రేమమ్' సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు చందు మొండేటి వరుణ్ తేజ్ హీరోగా తన తదుపరి చిత్రాన్ని ఖరారు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన స్టోరీ లైన్ కూడా ఓకే అయినట్టు, ప్రస్తుతం స్క్రిప్ట్ పని మొదలయినట్టు చెబుతున్నారు. గతంలో వచ్చిన 'గజనీ' సినిమాలో సూర్య పోషించిన షార్ట్ టర్మ్ మెమొరీ లాస్ బాధితుడి తరహాలో ఈ చిత్రంలోని హీరో పాత్రను మరింత విభిన్నంగా డిజైన్ చేశారట. వరుణ్ ప్రస్తుతం 'మిస్టర్', 'ఫిదా' చిత్రాలలో నటిస్తున్నాడు. ఇవి పూర్తికాగానే చందు మొండేటి చిత్రంలో చేయనున్నాడట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com