కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదులు పంజా విసిరారు

- October 10, 2016 , by Maagulf
కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదులు పంజా విసిరారు

కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదులు పంజా విసిరారు. అప్రమత్తమైన భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరపడంతో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ఆర్మీ జవాను, మరో పోలీసు గాయపడ్డారు. ప్రభుత్వ భవనంలో ఇంకా ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నట్టు భావిస్తుండటంతో సైన్యం వారిని చుట్టుముట్టింది. తొలుత ఉగ్రవాదులు పాంపోర్‌లోని ఇడిఐ భవనంలో ఉన్నట్లు భద్రతాదళాలకు సమాచారం అందడంతో వారు ఆ భవనాన్ని, చుట్టుపక్కల ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. సైనికులను గుర్తించిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయి.కాగా, పోంపోర్‌లో ఉగ్రదాడి ఘటన, తాజా పరిస్థితిపై కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌కు ఆర్మీ చీఫ్ వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com