ప్రపంచవ్యాప్తంగా కబడ్డీకి గుర్తిపువస్తుంది - చలమలశెట్టి సునీల్‌

- October 12, 2016 , by Maagulf
ప్రపంచవ్యాప్తంగా కబడ్డీకి గుర్తిపువస్తుంది - చలమలశెట్టి సునీల్‌

గ్రామీణ క్రీడైన కబడ్డీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తోందని వైఎస్సార్‌ సీపీ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ చలమలశెట్టి సునీల్‌ అన్నారు. అంబేడ్కర్‌ యూత్‌ రిక్రియేషన్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో సామర్లకోట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మంగళవారం రాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ మెమోరియల్‌ 43వ జిల్లా స్థాయి జూనియర్‌ కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. సునీల్‌ ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్సార్‌ సీపీ పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ తోట సుబ్బారావు నాయుడు మాట్లాడుతూ కబడ్డీ వ్యక్తిగత నైపుణ్యంతో కూడినదన్నారు.

అనంతరం ముఖ్య అతిథులు క్రీడా జెండాను ఎగుర వేసి కోర్టులను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. టోర్నీ నిర్వాహకులు ఉబా జాన్‌మోజెస్, కెనడీ మాట్లాడారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు బి.మురళీ కుమార్, గౌరవ అధ్యక్షుడు​ బాబు, జాతీయ కోచ్‌ పోతుల సాయి, జిల్లా కార్యదర్శి శ్రీనివాసు, ఉపాధ్యక్షుడు కొండపల్లి శ్రీను, సహాయ కార్యదర్శి  టి. వైకుంఠం, లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎం. రాజబాబు, కార్యదర్శి ఎం. రమేష్‌బాబు, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు గోలి వెంకట అప్పారావు చౌదరి, బోనాసు వెంకటేశ్వరరావు, కౌన్సిల్‌ ప్రతిపక్ష నాయకుడు ఆవాల లక్ష్మీనారాయణ, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు సీహెచ్‌ వీర్రాజు, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు ఎం. శ్రీను, కోశాధికారి ఎస్‌. దుర్గారావు, పీఈటీలు ఎండీవీ ప్రసాద్, ఎం.సుబ్బారావు పాల్గొన్నారు.

కబడ్డీ చాంపియన్‌గా కిర్లంపూడి​ జట్టు నిలిచింది. బుధవారం రాత్రి జరిగిన ఫైనల్స్‌లో కిర్లంపూడి - కాకినాడ ఐడియల్‌ జట్లు తలపడ్డాయి. కిర్లంపూడి 29 పాయింట్లు, కాకినాడ 24 పాయింట్లు సాధించాయి. తృతీయ స్థానంలో విరవ, దివిలి సంయుక్తంగా నిలిచాయి. బహుమతి ప్రదానోత్సవానికి వైఎస్సార్‌ సీపీ పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ తోట సుబ్బారావునాయుడు, కృష్ణవంశీ ఫౌండేషన్‌ చైర్మన్, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు వర్ధనపు కృష్ణ వంశీ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. విజేతకు రూ.1,116, ద్వితీయస్థానంలో నిలిచిన జట్టుకు రూ.500 బహుమతిని వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు మద్దాల శ్రీను ప్రత్యేకంగా ప్రకటించారు.

జిల్లా కబడ్డీ టీము సభ్యులు:
పి. మణికంఠ, పి. అచ్చుతకుమార్, మహేష్, జి. రాంబాబు, పి. బాలసుబ్రహ్మణ్యం, బి. ధనశేఖర్, కె.వరబాబు, ఎస్‌.హరిష్, పి.వెంకటేశ్వరరావు, సీహెచ్‌ చంద్రశేఖర్, ఎస్‌.అజయ్‌లను ఎంపిక చేశారు. వీరు ఈ నెల 20 నుంచి విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్‌ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారు.​

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com