మస్కట్: ఐఎస్సి సలాహ్ నవరాత్రి వేడుకలు
- October 12, 2016
ఇండియన్ సోషల్ క్లబ్ (ఐఎస్సి) సలాహ్, గుజరాతీ విభాగం, రంగ్మా 2016 (నవరాత్రి ఫెస్టివల్) వేడుకల్ని ఐఎస్సి గ్రౌండ్లో ప్రారంభించాయి. ఐఎస్సి, సలాహ్ ఛైర్మన్ మన్ రపీత్ సింగ్, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంప్రదాయ లైటింగ్ మరియు ల్యాంప్‌తో వేడుకలు ప్రారంభమయ్యాయి. దోఫార్ రీజియన్, ఇండియన్ ఎంబసీ కాన్సులర్ ఏజెంట్ కూడా అయిన మన్రపీత్ సింగ్, గుజరాతీ విభాగం ఈ కార్యక్రమాల నిర్వహణ విషయంలో చూపుతున్న శ్రద్ధను అభినందించారు. ఈ సందర్భంగా గుజరాతీ కమిటీ మెంబర్స్‌ని కూడా అభినందించారు. సంప్రదాయ గర్భా నృత్యాన్ని మహిళా మెంబర్స్ అద్భుతంగా చేశారు, ఆ నృత్యాన్ని చూసి ఆహూతులు పరవశించిపోయారు. ఈ ఉత్సవాల్లో అతి ముఖ్యమైన కార్యక్రమం 'ది గ్రాండ్ ఇండియన్ డే సెలబ్రేషన్' అక్టోబర్ 14న క్లబ్ ప్రాంగణంలో నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- భారత్-కివీస్ టీ20 ఫైనల్..
- మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్
- ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్
- 6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్‌కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!









