అమెరికాలో తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పర్యటన..

- October 13, 2016 , by Maagulf
అమెరికాలో తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పర్యటన..

 అమెరికాలో తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు, పలు కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు. భారత రాయబారి తరుణ్ జీత్ సింగ్‌తో మంత్రి కేటీఆర్‌ భేటీ అయ్యారు. తెలంగాణ, అమెరికాలోని పలు రాష్ట్రాల మధ్య వాణిజ్య వ్యాపార సంబంధాల బలోపేతానికి సహకరించాలని ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు. అనంతరం హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్‌ జనరల్‌గా నియమించబడిన కేథరీన్‌ బి. హడ్డాతో భేటీ అయిన కేటీఆర్ తెలంగాణ నుంచి వచ్చే విద్యార్దులు, వారి సమస్యలపై కేథరీన్‌తో చర్చించారు. బోయింగ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్‌ మార్క్‌ అలెన్‌ కేటీఆర్‌ను కలిశారు. నగరంలోని ఏరో స్పేస్ సిటీలో ఉన్న బోయింగ్ సంస్ధకు ప్రభుత్వ సహకారంపై మార్క్‌ హర్షం వ్యక్తం చేశారు.ఏరో స్పేస్ రంగంలో విద్యార్థులు, యువతకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై మార్క్‌తో కేటీఆర్ చర్చలు జరిపారు. యునైటెడ్‌ స్టేట్స్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. కాలుష్యాన్ని తగ్గిస్తూ అంతర్జాతీయ పర్యావరణ ప్రమాణాలతో రాష్ట్రం ముందుకు వెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. హైదరాబాద్‌లోని ఫార్మా కంపెనీలను ఔటర్‌రింగ్‌రోడ్డు అవతలకు ఫార్మాసిటీలోకి తరలించే ప్రయత్నాలను ఈ సందర్భంగా కేటీఆర్ వారి దృష్టికి తీసుకువచ్చారు.ఈ విషయంలో ప్రభుత్వానికి మార్గదర్శకాల రూపకల్పనలో సహకరించేందుకు యునైటెడ్‌ స్టేట్స్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ ముందుకువచ్చింది. అమెరికా ఫార్మా సదస్సులోనూ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ప్రముఖ ఫార్మా కంపెనీలు పైజర్, ఏలీ లీలీ, అలెక్సియన్ మెర్క్, అమ్జెన్ కంపెనీల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం, ఫార్మాసిటీ గురించి కేటీఆర్ వారికి వివరించారు.క్లీవ్ లాండ్ మెటార్ సైకిల్ వర్క్ కంపెనీ సీఈవో జోనాథన్‌తో మంత్రి కేటీఆర్‌ భేటీ అయ్యారు. తెలంగాణలో మాన్యూఫ్యాక్చరింగ్ యూనిట్ నెలకొల్పాలని, అందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. కమ్యూనిక్లిక్ సంస్ధ ప్రతినిధి రాంరెడ్డితో మంత్రి కేటీఆర్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సంస్థను ప్రారంభించేందుకు కమ్యూనిక్లిక్ సంస్ధ ముందుకు వచ్చింది.గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యుర్‌షిప్‌ సమ్మిట్‌-2017ను హైదరాబాద్‌లో నిర్వహిస్తే పూర్తి సహకారం అందిస్తామని, ఈ సమావేశానికి హైదరాబాద్‌ అత్యుత్తమ ప్రాంతమని కేటీఆర్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com