అనేక అనారోగ్య సమస్యలను తగ్గించే దివ్యౌషధం నిమ్మరసం
- October 14, 2016
ప్రకృతి ప్రసాదించిన ఎన్నో సహజవనరులు మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కూరగాయలు, పండ్లు ముఖ్యమైనవి. ఇలాంటి సహజవనరుల్లో నిమ్మకాయ ఒకటి. ఇది ఆరోగ్య ప్రదాయని. నిమ్మ అనేక అనారోగ్య సమస్యలను తగ్గించే దివ్యౌషధం. ముఖ్యంగా... జీర్ణ సమస్యలను తగ్గించడంలో నిమ్మకు మించింది మరొకటి లేదని చెప్పొచ్చు. శరీరంలోని లవణ శాతాన్ని పెంచి, వ్యాధినిరోధక శక్తిని పెంపొందించడంలో నిమ్మ అత్యంత కీలక పాత్రను పోషిస్తుంది. అందుకే ఎండాకాలంలో నిమ్మరసం తాగడానికి ఎక్కువ మంది మొగ్గుచూపుతారు. నిమ్మరసాన్ని రోజూ నిద్ర లేవగానే ఉదయం తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. 2 కప్పుల నీటిని వేడి చేయాలి. ఆ వేడి నీరు గోరువెచ్చగా ఉండగా 4 అల్లం ముక్కలు నీటిలో వేయాలి. వాటితో పాటు ఒక నిమ్మకాయను అందులో పిండుకోవాలి. కొంత పెప్పర్, ఒక టీ స్పూన్ తేనే కలపాలి. ఈ మిశ్రమాన్ని కలగలిపి సేవించడం వల్ల జీర్ణ ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఇలాచేయడం వల్ల శరీరంలో ఉండే నీటి శాతం పెరిగుతుంది. చర్మానికి మేలు చేసే విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. దీనివల్ల వ్యాధికారక క్రీముల తాకిడికి చర్మం తట్టుకుంటుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







